Corona Virus Update: గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు..

Corona Virus Update: గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మొత్తం COVID-19 కేసులు 2,85,74,350 కు చేరుకున్నాయి.

Corona Update: భారతదేశంలో కొత్తగా కరోనావైరస్ సంక్రమణ కేసులు 1.32 లక్షలకు పైగా నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మొత్తం COVID-19 కేసులు 2,85,74,350 కు చేరుకున్నాయి.

ఇప్పటి వరకు నమోదైన COVID-19 యాక్టివ్ కేసుల సంఖ్య 16,35,993. ఇది ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 5.73 శాతం కలిగి ఉంది. రికవరీ రేటు 93.08 శాతం అని డేటా పేర్కొంది.

ఒక రోజులో మొత్తం 1,32,364 కొత్త అంటువ్యాధులు నమోదు కాగా, మరణాల సంఖ్య 2,4013. రోజువారీ కొత్త మరణాలతో కలిపి ఈ సంఖ్య 3,40,702 చేరుకుంది. ఉదయం 8 గంటలకు విడుదలైన డేటాలో ఈ గణాంకాలు పొందుపరిచారు.

కాగా, గురువారం ఐదు స్థాయిలలో అన్‌లాక్ ప్రణాళికను ప్రకటించిన తరువాత, మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ మధ్య నుండి కోవిడ్ ఆంక్షలను తొలగించే కొత్త నిబంధనలు "ఇంకా పరిశీలనలో ఉన్నాయి" అని స్పష్టం చేసింది.

నిన్న సాయంత్రం, మహారాష్ట్ర రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మంత్రి విజయ్ వాద్దెట్టివార్ రాష్ట్రానికి ఐదు స్థాయిల అన్‌లాకింగ్ పాజిటివిటీ రేటుని ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ ఆధారంగా నిర్ణయించినట్లు ప్రకటించారు. ఉదాహరణకు లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయబడుతుంది. రెడ్ జోన్ ఏరియాల్లో పూర్తి లాక్డౌన్ ఉండొచ్చు అని ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో సమావేశం తరువాత మీడియాకు వివరించిన వద్దెట్టివర్, థానేతో సహా 18 జిల్లాలు లాక్డౌన్ పూర్తిగా ఎత్తి వేయాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story