కరోనా రికవరీలో భారత్ అగ్రస్థానం

కరోనా రికవరీలో భారత్ అగ్రస్థానం
భారత్‌లో కరోనా మహమ్మారి భారీగా విజృంభిస్తుంది. ప్రపంచంలోనే అత్యంతగా వేగంగా కరోనా విజృంభిస్తున్న దేశాల్లో భారత్

భారత్‌లో కరోనా మహమ్మారి భారీగా విజృంభిస్తుంది. ప్రపంచంలోనే అత్యంతగా వేగంగా కరోనా విజృంభిస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. కేసులు సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న భారత్.. అమెరికాను కూడా అధిగమించి మొదటి స్థానానికి చేరుకోవచ్చిన వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కరోనా కేసులతో పాటు రికవరీలో కూడా భారత్ దూసుకుపోతుంది. రికవరీ రేటులో భారత్ అగ్రస్థానంలో ఉంది. అమెరికాను కూడా అధిగమించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 42 లక్షలు దాటిందని వెల్లడించింది. వైరస్‌ను గుర్తించేందుకు ప్రభుత్వం సకాలంలో తీసుకుంటున్న సమర్థవంతమైన చర్యలవల్లే ఇది సాధ్యపడిందని తెలిపింది. కాగా.. గడిచిన 24 గంటల్లో 93,337 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 53 లక్షలను దాటిందని తెలిపింది. అయితే, అందులో 42,08,432 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Tags

Next Story