అక్టోబర్ నాటికి దేశంలో కరోనా.. మొదటి స్థానంలో భారత్ !!

ప్రస్తుతం కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్ అక్టోబర్‌లో మొదటి స్థానానికి చేరుకోనుందని తాజా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్ క్యాంపస్‌కు చెందిన ముగ్గురు బిట్స్ పిలానీ సంస్థ సభ్యులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. గత నాలుగు నెలల్లో భారత్ లో నమోదైన కరోనా కేసులు ఆధారంగా అధ్యయనం చేశారు. దీనిప్రకారం రెండు మోడళ్లను రూపొందించారు. ఈ మోడళ్ల ప్రకారం భారత్‌లో అక్టోబర్‌లో అమెరికాను దాటి కరోనా కేసుల్లో మొదటి స్థానానికి చేరుతుందని వారు అంచానా వేశారు. అక్టోబర్ తొలి వారంలో 70 లక్షలకు చేరుకోని.. ప్రపంచంలోనే అత్యధిక కేసులు కలిగిన దేశంగా భారత్ తొలిస్థానంలో నిలిచే అవకాశం ఉందని అన్నారు. వారి అంచనాల ప్రకారం సెప్టెంబర్ 5, 6 తేదీల్లో బ్రెజిల్‌ను దాటి భారత్ రెండో స్థానానికి చేరుకుంటుందని అంచాన వేశారు. వారి అంచనాకు అనుగుణంగా సెప్టెంబర్ 7న భారత్ రెండో స్థానానికి చేరుకుందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com