Tamil Nadu Fire Accident: బాణసంచా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అయిదుగురు సజీవ దహనం

Tamil Nadu Fire Accident: తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మరో 10 మందికి తీవ్రగాయలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. శంకరాపురంలోని బాణసంచా కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సంభవించడంతో.. పక్కనే ఉన్న సెల్‌ఫోన్ దుకాణాలు, బేకరీల్లో కూడా మంటలు వ్యాపించాయి. అక్కడ నాలుగు సిలిండర్లు పేలాయి. దీంతో చుట్టు పక్కల మిగిలిన షాపులకు మంటలు విస్తరించాయి. ఆ ప్రాంతమంతా పొగ కమ్మేసింది.
భారీ అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడ పరిస్థితి భయానకంగా కనిపిస్తోంది. పెద్ద పెద్ద పేలుళ్ల శబ్దాలతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. ఒక భారీ అగ్ని గోళం పైకి వెళ్తున్నట్లు ప్రమాదానికి సంబంధించిన వీడియో దృశ్యాల్లో కనిపించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్.. రెస్క్యూ ఆపరేన్ చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.పరిస్థితిని జిల్లా కలెక్టరు పిఎన్ శ్రీధర్ సమీక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com