గ్రేట్ .. 23 మందికి వందశాతం పర్సంటైల్

జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 23 మందికి వందశాతం పర్సంటైల్ సాధించారు. ఇందులో తెలంగాణ నుంచి ఏడుగురు విద్యార్థులకు వందశాతం పర్సంటైల్ రాగా ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు. ఈ విషయాన్ని నేషనల్ టెస్టి్ంగ్ ఏజెన్సీ తెలిపింది. తెలంగాణకు చెందిన విధిత్, సాయితేజ, అనూప్, దినేశ్ రెడ్డిలు 300లకు 300 మార్కులు సాధించి 100 పర్సంటైల్ పొందారు.
కాగా ఈ రోజు ఉదయం జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలు పొందుపరిచారు. పేపర్ 1 పరీక్షలు 2024 జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించగా.. పేపర్ 2 పరీక్ష జనవరి 24న జరిగింది. దేశవ్యాప్తంగా పేపర్-1కు 12,21,615 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 8,24,945 మంది పురుషులు.. 4,06,920 మంది మహిళలు.. 9 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. 11,70,036 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఇక సెషన్-2ను ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు సెషన్లు పరీక్ష రాసిన వాళ్లకు) తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com