Group-1 : గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఓఎంఆర్ షీట్లను ఎల్లుండి సాయంత్రం 5 గంటల నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ లాగిన్‌తో సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా పేపర్ లీకేజీలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను జూన్ 9న నిర్వహించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో 563 పోస్టులతో కూడిన గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనకు 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. 74.86 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని నవీన్ నికోలస్ ప్రకటించారు. అత్యధికంగా వనపర్తిలో 82.74 హాజరు శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 61.78 శాతం నమోదైందని తెలిపారు.
జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత… ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించనున్నారు. మరోవైపు… మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com