DSC Notification : టీచర్ జాబ్స్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవాళే.. ఇలా అప్లై చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో టీచర్ అభ్యర్థులు అసలు పని మొదలుపెట్టే రోజు ఇదే. 6వేల 100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఓ ప్రకటన చేసింది. డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. దీనికి సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) ఇవాళ రిలీజ్ కానుంది.
నోటిఫికేషన్ విడుద తర్వాత.. అధికారికంగా వెబ్ సైట్ ప్రారంభం, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం టెట్, డీఎస్సీని ప్రభుత్వం వేర్వేరుగా నిర్వహించనుంది. రెండు పరీక్షల్నీ కంప్యూటర్ విధానంలోనే నిర్వహిస్తున్నారు. నిర్వహణలో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించేందుకు ఓ వెబ్ సైట్ ను డిజైన్ చేసింది. డీఎస్సీకి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ https://apdsc.apcfss.in/ పేరుతో రూపొంందించిన ఈ వెబ్ సైట్ ను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ సైట్ లోకి వెళ్తే పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
వెబ్ సైట్ లో ఆప్షన్లు ఇవాళ్టినుంచే అందుబాటులోకి రానున్నాయి. అప్లికేషన్ల స్వీకరణ, ఫీజు చెల్లింపుతో పాటు ఇతర ఆప్షన్లు ఇవాళ్టినుంచి ఓపెన్ అవుతాయి. వచ్చే నెల 15 నుంచి 30 వరకూ డీఎస్సీ పరీక్షలు ఉంటాయి. మార్చి 31 కల్లా ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేస్తారు. అభ్యంతరాలు తెలిపేందుకు ఏప్రిల్ 1 వరకూ అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్ 2న తుది ఆన్సర్ కీ విడుల చేస్తారు. ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తామని సర్కారు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com