బ్రేకింగ్... మార్చి10న గ్రూప్-1 హాల్ టికెట్లు

గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లను ఈ నెల 10న విడుదల చేయబోతున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. https://psc.ap.gov.in/ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. మార్చి 17న ఉ.10 నుంచి 12 వరకు పేపర్-1, మ.2 నుంచి 4 వరకు పేపర్-2 ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో 18 జిల్లా కేంద్రాల్లో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో 81 గ్రూప్ 1 సర్వీసు పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో 9 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, 18 ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు, 26 డీఎస్పీ (సివిల్) పోస్టులు, 6 రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ పోస్టులు, 5 కోఆపరేటివ్ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు, 4 జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com