TS : తెలంగాణలో బడిబాట కార్యక్రమం వాయిదా

X
By - Manikanta |3 Jun 2024 10:10 AM IST
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సిన బడిబాట కార్యక్రమం వాయిదా పడింది. రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎప్పట్నుంచి తిరిగి ప్రారంభిస్తుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. బడి మానేసిన, బడిలో చేరని పిల్లను గుర్తించి వారిని స్కూళ్లలో చేర్చేందుకు ఈ నెల 19 వరకు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జూన్ 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానుండటంతో షెడ్యూల్ ప్రకారం..బడిబాటలో భాగంగా జూన్ 3 నుంచి జూన్ 19 వరకు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా వాయిదా వేసింది విద్యాశాఖ .
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com