BYJUS : ఆఫీసు స్థలాలను ఖాళీ చేస్తోన్న బైజూ.. వర్క్ ఫ్రమ్ హోమ్ పై ఆసక్తి

BYJUS : ఆఫీసు స్థలాలను ఖాళీ చేస్తోన్న బైజూ.. వర్క్ ఫ్రమ్ హోమ్ పై ఆసక్తి

బైజూస్ తమ ఉద్యోగులందరినీ వెంటనే ఇంటి నుండి పని చేయమని కోరుతోంది. బెంగళూరులోని (Bnagalore) నాలెడ్జ్ పార్క్, ఐబీసీలోని ప్రధాన కార్యాలయాన్ని మినహాయించి తన కార్యాలయ స్థలాలన్నింటినీ ఇప్పటికే ఖాళీ చేసింది. బెంగళూరు ప్రధాన కార్యాలయంస 300 బైజు ట్యూషన్ సెంటర్‌లలోని ఉద్యోగులు కార్యాలయాల నుండి పని చేస్తూనే ఉంటారని ఓ నేషనల్ మీడియా నివేదించింది.

ఈ నివేదిక ప్రకారం, రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాలను మూసివేయడం బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ పునర్నిర్మాణ వ్యూహం నిర్ణయం అని చెప్పారు. ఇటీవల పూర్తయిన రైట్స్ ఇష్యూ సబ్మిషన్ నుండి సేకరించిన నిధుల చట్టబద్ధతకు సంబంధించి చిక్కుకున్న ఈ edtech కంపెనీ తన పెట్టుబడిదారులతో న్యాయపరమైన వివాదంలో చిక్కుకుంది.

బైజూస్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత సంవత్సరంలో కంపెనీ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. తన ఉద్యోగులకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన పూర్తి జీతాలను కూడా చెల్లించడంలో విఫలమైంది. అది ఆదివారం వేతనాలలో కొంత భాగాన్ని విడుదల చేసింది. రైట్స్ ఇష్యూస్ నుండి నిధులను ఉపయోగించగలిగిన తర్వాత మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తానని కంపెనీ హామీ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story