Layoffs : 4000 మంది ఉద్యోగులను తొలగించిన సిస్కో

Layoffs : 4000 మంది ఉద్యోగులను తొలగించిన సిస్కో

Layoffs టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది ప్రారంభంలో మొదలైన మాంద్యం భయాలు ఉద్యోగులపై నేటికీ ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాదిలో పలు దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొల గించాయి. తాజాగా గ్లోబల్ నెట్ వర్కింగ్ కంపెనీ సిస్కో (Cisco) సిస్టమ్స్ 4,000 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. 2023 నాటికి సిస్కోలో మొత్తం 85,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా లేఆఫ్స్ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి సమానం. కంప్యూటర్ నెట్వర్కింగ్ పరికరాల తయారీలో అతిపెద్ద సంస్థ అయిన సిస్కో అంతర్జాతీయంగా ఈ తొలగింపుల ప్రక్రియ ఉంటుందని పేర్కొంది. ప్రధానంగా కేబుల్ సర్వీసులతో పాటు టెలికాం విభాగాల నుంచి డిమాండ్ మందగించడంతో ఈ నిర్ణయం తీసుకు న్నట్టు వివరించింది. టెలికాం పరిశ్రమలోని క్లయింట్ల ఖర్చును తగ్గించడం, నెట్ వర్కింగ్ గేర్ ఇన్వెంటరీలను క్లియర్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపింది. గత కొంతకాలంగా సిస్కో ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిందని పరిశ్రమ వర్గాలు సైతం వెల్లడిం చాయి. మరోవైపు, ఈ ఏడాదిలో ఇప్పటికే పలు కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించాయి. ప్రముఖ లేఆఫ్స్ ట్రాకర్ లేఆఫ్స్ డాట్ ఎఫ్వైఐ ప్రకారం, 2024 ప్రారంభం నుంచి ఉప్పటివరకు టెక్ రంగంలో మొత్తం 35,000 మంది ఉద్యోగుల తొలగింపులు జరిగాయి.

Tags

Next Story