DSC Applications : నేటి నుంచి డీఎస్సీ దరఖాస్తులు

DSC : డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. వచ్చే నెల 3 వరకూ అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజును రూ.వెయ్యిగా నిర్ణయించారు. అయితే, ఫీజు చెల్లింపునకు మాత్రం ఏప్రిల్ 2ను చివరి తేదీగా నిర్ణయించారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈసారి అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచడంతో చాలా మంది దరాఖాస్తు చేసుకునే వీలుంది. గతంలో పాత డీఎస్సీకి 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే.. వీటికి అదనంగా మరో రెండు.. మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకోనున్నారు. మొత్తం 11,062 పోస్టుల్లో 2629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,508 ఎస్జీటీలు, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరిలో స్కూల్ అసిస్టెంట్ 220, స్పెషల్ ఎస్జీటీలు 796 ఉద్యోగాలున్నాయి.
దరఖాసు లను ఏప్రిల్ 2 వరకు స్వీకరిస్తారు. అప్లికేషన్ ప్రాసెసింగ్ మరియు రాత పరీక్ష కోసం చెల్లించాల్సిన రుసుము ఒక్కో పోస్టుకు రూ.1,000 చెల్లించాలి. దరఖాస్తు చేసే ప్రతి పోస్టు వేర్వేరు దరఖాస్తులను సమర్పించాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com