EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఎంత వస్తుందో ఇలా తెల్సుకోండి.

EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఎంత వస్తుందో ఇలా తెల్సుకోండి.
X

EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించే కీలకమైన అంశం EPS. 2026లో పదవీ విరమణ చేయబోతున్న వారు తమకు నెలకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. చాలామంది ప్రైవేట్ ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే డబ్బు మొత్తం రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి వస్తుందని భావిస్తారు. కానీ వాస్తవానికి మీ పీఎఫ్ అకౌంట్‌లో రెండు భాగాలు ఉంటాయి. మీ జీతం నుంచి కట్ అయ్యే వాటా నేరుగా పీఎఫ్ ఖాతాకు వెళ్తే, కంపెనీ ఇచ్చే వాటాలో కొంత భాగం (8.33%) EPS ఖాతాలోకి వెళ్తుంది. ఇదే మీకు బుద్ధాప్యంలో నెలవారీ పెన్షన్‌ను అందిస్తుంది. అయితే ఈ పెన్షన్ పొందడానికి కనీసం 10 ఏళ్ల సర్వీస్ ఉండాలి. 58 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి.

పెన్షన్ లెక్కించే సులభమైన ఫార్ములా

మీకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకోవడానికి EPFO ఒక సాధారణ ఫార్ములాను రూపొందించింది. దీనికోసం మీరు ఎవరిపైనా ఆధారపడక్కర్లేదు.

పెన్షన్ = (పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్న జీతం × సర్వీస్ కాలం) / 70

Note : ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ జీతం ఎంత ఉన్నా సరే, పెన్షన్ లెక్కల కోసం గరిష్ట జీత పరిమితిని నెలకు రూ. 15,000 గానే పరిగణిస్తారు. అంటే ఒకవేళ మీ బేసిక్ జీతం రూ. 1 లక్ష ఉన్నా, పెన్షన్ మాత్రం రూ. 15,000 ప్రాతిపదికనే లెక్కిస్తారు.

కన్హయ్య ఉదాహరణతో అర్థం చేసుకుందాం..

ఒక రియల్ లైఫ్ ఉదాహరణ తీసుకుంటే.. కన్హయ్య అనే వ్యక్తి 2026లో రిటైర్ అవుతున్నాడు అనుకుందాం. ఆయన మొత్తం 50 ఏళ్ల పాటు సర్వీస్ (సర్వీస్ వెయిటేజీతో కలిపి) చేశాడనుకుందాం. ఇప్పుడు ఆయన పెన్షన్ లెక్క ఇలా ఉంటుంది:

* గరిష్ట జీత పరిమితి: రూ. 15,000

* సర్వీస్ కాలం: 50 ఏళ్లు

* లెక్క: 15,000*50 / 70 = 10,714

అంటే రిటైర్మెంట్ తర్వాత కన్హయ్యకు నెలకు సుమారు రూ.10,714 పెన్షన్ వస్తుంది.

ముందే పెన్షన్ తీసుకుంటే భారీ నష్టం

చాలామంది 58 ఏళ్ల వరకు ఆగకుండా 50 ఏళ్లకే పెన్షన్ తీసుకోవాలని చూస్తారు. దీనిని ఎర్లీ పెన్షన్ అంటారు. కానీ దీనివల్ల భారీగా నష్టపోయే అవకాశం ఉంది. EPFO నిబంధనల ప్రకారం, 58 ఏళ్ల కంటే ముందే పెన్షన్ తీసుకోవడం మొదలుపెడితే, ప్రతి ఏటా 4% చొప్పున పెన్షన్ మొత్తంలో కోత విధిస్తారు. కాబట్టి స్మార్ట్ ఇన్వెస్టర్‌గా 58 ఏళ్ల వరకు వేచి చూడటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వెబ్ సైట్ల సమాచారం ప్రకారం..

ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత హైయర్ పెన్షన్ (ఎక్కువ పెన్షన్) ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఎవరైతే రూ.15,000 పరిమితి కంటే ఎక్కువ జీతంపై పెన్షన్ వాటా చెల్లించారో, వారికి పెన్షన్ మొత్తం గణనీయంగా పెరుగుతుంది. అయితే దీనికి కొన్ని అదనపు షరతులు వర్తిస్తాయి. 2026లో రిటైర్ అయ్యే వారు ఉమ్మడి ఆప్షన్ ఫారమ్ నింపి ఉంటే, వారి పెన్షన్ లెక్కలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Tags

Next Story