Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్

నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఖాళీలకు ఇటీవలే విడుదల చేసిన భారీ నోటిఫికేషన్ లో గడువు పెంచింది. 1377 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ఆ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ విభాగంలో ఖాళీలు ఉన్నట్లు గతంలో కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. కాగా వివిధ విభాగాలన్నింటిలో కలిపి మొత్తం 1377 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. వయోపరిమితి, పోస్టులు, అలానే ఇతర సమాచారం కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

ఆఖరి నిమిషంలో కేంద్రం ఆ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువును మే 7వ తేదీ వరకు పొడిగించారు.

Tags

Read MoreRead Less
Next Story