Good News : మూడు రోజుల్లోనే పిఎఫ్ డబ్బులు విత్‌డ్రా

Good News : మూడు రోజుల్లోనే పిఎఫ్ డబ్బులు విత్‌డ్రా
X

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఒ) ఇప్పుడు పిఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునే నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. కొత్త రూల్స్ ప్రకారం, పిఎఫ్ ఖాతాదారులు రూ.1 లక్ష చాలా సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా కేవలం 3 రోజుల్లో ఖాతాదారుల ఎక్కౌంట్‌లో డబ్బు జమ అవుతుంది. ఏసందర్భాల్లో పిఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బు లు అడ్వాన్స్ తీసుకోవచ్చో ఇపిఎఫ్‌ఒ వెల్లడించింది. ఇప్పటి వరకైతే వైద్య ఖర్చుల కోసం మాత్రమే పిఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.

కానీ ఇకపై పిల్లల పెళ్లిళ్లు, ఇంటి కొనుగోలు ఇతరత్రా అవసరాలకు కూడా పీఎఫ్ డబ్బుల్ని కొంత విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికోసం ఇపిఎఫ్‌ఒ కొత్తగా ఆటో మోడ్ సెటిల్‌మెంట్ ప్రవేశపెట్టింది. దీనిలో ఉద్యోగులు అత్యవసరమైతే డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు. కొన్ని రకాల అత్యవసరాలు వచ్చినప్పుడు పిఎఫ్ ఖాతాదారులు పిఎఫ్ డబ్బుల నుంచి కొంత అడ్వాన్స్ పొందవచ్చు. ఆటోమోడ్ క్లెయిమ్ అనేది 2020 ఏప్రిల్ నెలలోనే ప్రారంభమైంది. ఇపిఎఫ్‌ఒ అడ్వాన్స్ పరిమితిని కూడా పెంచింది. ఇంతకుముందు రూ.50 వేలు మాత్రమే అడ్వాన్స్ తీసుకునే అవకాశముంది. ఇప్పుడు 1 లక్ష వరకూ పెంచారు. ఆటో సెటిల్‌మెంట్ మోడ్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో ఈ డబ్బులు విత్ డ్రా చేయాల్సి ఉంటుంది.

పిఎఫ్ ఖాతాదారుల కోసం డెత్ క్లెయిమ్ నియమాలలో మార్పులు చేశారు. ఈ సమాచారాన్ని ఇపిఎఫ్‌ఒ ఒక సర్క్యులర్ ద్వారా వెల్లడించింది. కొత్త ని ప్రకారం, ఇపిఎఫ్‌ఒ సభ్యుడు చనిపోతే, అతని ఆధార్ పిఎఫ్ ఖాతాకు లింక్ చేయకపోయి నా ఆ ఖాతాదారుడి డబ్బు నామినీకి చెల్లిస్తారు.

Tags

Next Story