University Administrators : యూనివర్సిటీల ఇన్చార్జులుగా ఐపీఎస్ అధికారుల నియామకం

రాష్ట్రంలో ఉన్న 10 విశ్వ విద్యాలయాల వైస్ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. దీంతో.. ఇంచార్జులుగా ఐపీఎస్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. వీసీల నియామకాలకు ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్త వీసీల నియామకానికై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.
ఇప్పటికే , ఒక్క కాకతీయ విశ్వవిద్యాలయం తప్ప మిగతా 9 విశ్వవిద్యాల యాల ఉప కులపతుల నియామకాల కోసం సెర్చ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. గత ప్రభుత్వం సామాజిక న్యాయానికి తిలోదకాలు ఇచ్చిందనీ, తమ ప్రభుత్వం మాత్రం సామాజిక న్యాయం నేపథ్యంగా నియామకాలు చేపడుతుందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించినందున ఆ దిశలోనే కొత్త వీసీల నియామకం కోసం చర్యలు మొదలయ్యాయి.
ఈ నెలాఖరుకు నియామక ప్ర క్రియ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కాకతీయ యూనివర్సిటీ మినహా మిగతా ఉస్మా నియా , జేఎన్టీయూహెచ్, పాలమూరు, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలకు వీసీల స్థానంలో సివిల్ సర్వెంట్ అధికారులను తాత్కాలికంగా నియమించింది సర్కార్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com