Government Warns : ఆఫీస్‌కు లేటుగా వచ్చే ఉద్యోగులకు ప్రభుత్వం వార్నింగ్

ఆఫీస్‌కు లేటుగా వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగులు 9amకి కార్యాలయంలో ఉండాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ స్పష్టం చేసింది. గ్రేస్ పీరియడ్‌ను కలుపుకొని 9.15amలోపు ఆఫీస్‌లోని బయోమెట్రిక్‌లో హాజరు వేయకపోతే హాఫ్ డే CLలో కోత విధించనుంది. ఆఫీస్‌కి రాలేకపోతే ఒకరోజు ముందే సమాచారమివ్వాలని సూచించింది. దానికి CL వర్తిస్తుందని చెప్పింది.
ఈ నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్పుడే ఏఈబీఏఎస్‌లో రిజిస్టర్డ్, యాక్టివ్ ఉద్యోగుల మధ్య ఎలాంటి తేడాలు ఉండవని ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలను పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, డిఫాల్టర్లను గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కార్యాలయానికి సిబ్బంది ఎవరైనా ఆలస్యంగా వస్తే, దానిని హాఫ్-డే క్యాజువల్ లీవ్‌గా పరిగణించాలని సూచించింది. నెలలో ఒకటి లేదా రెండుసార్లు, న్యాయమైన కారణాలతో ఆలస్యంగా కార్యాలయానికి ఎవరైనా సిబ్బంది వస్తే అధికారులు వారిపై చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com