AI Software Engineers : ఏఐ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు భారీ డిమాండ్

AI Software Engineers : ఏఐ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు భారీ డిమాండ్
X

ప్రపంచమంతా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం వేగంగా పెరుగుతోంది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు పెరుగుతున్నాయి. ఫలితంగా ఏఐ నిపుణులకు డిమాండ్ ఏర్పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు ఉన్న అభ్యర్ధులను తీసుకునేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి ఎన్నో బడా కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ ప్రతిభావంతుల కోసం కంపెనీల మధ్య పోటీ కూడా ఎక్కువగానే ఉంది. ఈ నిపుణుల కోసం కంపెనీలు ఎక్కువ మొత్తంలో వేతనాలు, బోనస్ లు ఇస్తామని ప్రకటిస్తున్నాయి.

ఏఐ ఉద్యోగాల్లోకి టెక్ కంపెనీలు రిక్రూట్మెంట్ చేస్తున్నాయి. సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల కంటే ఏఐ సాంకేతిక ఉన్న నిపుణులైన ఇంజినీర్లకు 50 శాతం కంటే ఎక్కువ వేతనాలు పొందుతున్నారు. లేఆఫ్ ల్లోనూ ఏ కంపెనీ కూడా ఏఐ నిపుణులను తొలగించలేదు. శాలరీ ట్రెండ్ ను ఎప్పటికప్పుడు తెలిపే ఓ ప్లాట్ ఫామ్ తన నివేదికలో ఏఐ నిపుణులకు ఉన్న డిమాండ్ ను వివరించింది.

2024 ఏప్రిల్ నాటికి అమెరికాలో ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ల సగటు వేతనం 3,00,000 డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో ఇది సుమారు 2,49,31,650 రూపాయులు. ఇతర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల కంటే వీరు లక్ష డాలర్ల వేతనం ఎక్కువ పొందుతున్నారు. 2022లో సాఫ్ వేర్ ఇంజినీర్లకు ఏఐ స్కిల్స్ ఉన్న వారికి మధ్య వేతన వ్యత్యాసం 30 శాతంగా ఉంటే, ప్రస్తుతం అది 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి ఐటీ రంగంలో ఏఐకి ఉన్న డిమాండ్ స్పష్టంగా తెలుస్తోంది.

Tags

Next Story