Jabalpur University : పరీక్ష నిర్వహించడం మర్చిపోయిన జబల్‌పూర్ యూనివర్సిటీ

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) జబల్‌పూర్‌లోని ఒక విశ్వవిద్యాలయం టైమ్‌టేబుల్‌ను విడుదల చేసినప్పటికీ, విద్యార్థులకు అడ్మిట్ కార్డ్‌లను జారీ చేసినప్పటికీ ఒక సబ్జెక్టుకు పరీక్ష నిర్వహించడం మర్చిపోయింది. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సు విద్యార్థులు రాణి దుర్గావతి యూనివర్శిటీకి చేరుకోగా, యూనివర్సిటీ సన్నద్ధం కాకపోవడంతో పరీక్ష నిర్వహించడం లేదని వారికి సమాచారం అందింది.
దీంతో యూనివర్శిటీలో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించి, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. అంతకుముందే విశ్వవిద్యాలయం M.Sc కోసం టైమ్‌టేబుల్‌ను ప్రకటించింది. ఫిబ్రవరిలో కంప్యూటర్ సైన్స్ మొదటి సెమిస్టర్ పరీక్ష జరగాల్సి ఉండగా సమీప జిల్లాల నుంచి కూడా వచ్చిన అభ్యర్థులు యూనివర్సిటీ ఎలాంటి సన్నద్ధం కాకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
తప్పిదం గురించి సమాచారం అందుకున్న నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) కార్యకర్తలు వైస్ ఛాన్సలర్ కార్యాలయంలోకి ప్రవేశించి రచ్చ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ డిమాండ్ చేసింది. పరీక్ష నిర్వహణకు బాధ్యులైన ఇద్దరు సిబ్బంది నుంచి మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని వైస్ ఛాన్సలర్ కోరారు. విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్లక్ష్యాన్ని అంగీకరిస్తూ విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ దీపేష్ మిశ్రా తెలిపారు. కొత్త టైమ్‌టేబుల్‌ను విడుదల చేశామని, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ మొదటి సెమిస్టర్ పరీక్ష మార్చి 7-15 వరకు జరుగుతుందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com