TG : ఇవాళ లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఫలితాలు

TG : ఇవాళ లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఫలితాలు
X

న్యాయ కళాశాలల్లో LLB, LLM కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. జూన్‌ 3న నిర్వహించిన ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి మ.3.30 గంటలకు రిలీజ్ చేస్తారు. ఫలితాలను Results.eenadu.netలో చెక్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టీజీలాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ జూన్‌ 3న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ 3న ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్షలు నిర్వహించారు.

టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలు తొలి రెండు సెషన్లు కలిపి మొత్తం 68 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణలో 64 కేంద్రాలు, ఏపీలో 4 కేంద్రాలు ఉన్నాయి. ఇక మూడో సెషన్‌ పరీక్షలను మొత్తం 50 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణలో 46 కేంద్రాలను, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Tags

Next Story