Exam Papers Leak : ఐదేళ్లలో 65 ఎగ్జామ్ పేపర్ల లీకులు..!

Exam Papers Leak : ఐదేళ్లలో 65 ఎగ్జామ్ పేపర్ల లీకులు..!
X

ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 65 ప్రశ్నా పత్రాలు లీకయ్యాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 8 ఎగ్జామ్ పేపర్లు లీక్ చేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్ (7), బిహార్ (6), గుజరాత్, మధ్యప్రదేశ్ (4), హరియాణా, కర్ణాటక, ఒడిశా, బెంగాల్ (3), తెలంగాణ, ఢిల్లీ, మణిపుర్ (2), జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, ఝార్ఖండ్‌లలో ఒక్కో ప్రశ్నాపత్రం లీకైంది. కాగా ఏపీలో మాత్రం ఒక్కసారి కూడా ఎగ్జామ్ పేపర్ లీక్ కాలేదు.

ప్రశ్నపత్రాలు లీకైన వాటిలో 45 పరీక్షలు ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు 45 ఉన్నాయి. మొత్తం మూడు లక్షల ఉద్యోగాల భర్తీకోసం ఆ పరీక్షలు నిర్వహించారు. వాటిలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో టీచర్ల నియామక పోటీ పరీక్షలు, అసోం, రాజస్థాన్, కర్ణాటక, జమ్మూ–కశ్మీర్‌లలో పోలీసు నియామక పరీక్షలు, ఉత్తరాఖండ్‌ అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ పరీక్ష, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్‌లలో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీ పరీక్షలు మొదలైనవి ఉన్నాయి.

మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో రాజస్థాన్‌కు చెందిన 10 మంది విద్యార్థులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ విద్యార్థులు వారికి బదులు డమ్మీ అభ్యర్థులతో పరీక్షలు రాయించారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో తాజాగా ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఓ స్కూల్ ప్రిన్సిపల్, సెంటర్ సూపరింటెండెంట్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.

Tags

Next Story