OTT Release : ఓటీటీలోకి పాన్ ఇండియన్ థ్రిల్లింగ్ ‘భ్రమయుగం’

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటించిన తాజా పాన్ ఇండియన్ థ్రిల్లింగ్ చిత్రం ‘భ్రమయుగం’ (Brhamayugam). భూతకాలం ఫేమ్ రాహుల్ సదాశివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వైనాట్ స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర అండ్ ఎస్. శశికాంత్ నిర్మించారు. ఫిబ్రవరి 15న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రేమలు సినిమాతో పోటిగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక సోనిలివ్‌లో ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని సోనిలివ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇక ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో వచ్చింది. అంటే ఒక్క సన్నివేశం కూడా కలర్‌లో ఉండదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com