RTC : ఆర్టీసీలో ఉద్యోగాల జాతర

RTC : ఆర్టీసీలో ఉద్యోగాల జాతర
X

దాదాపు పదేళ్ల తర్వాత ఆర్టీసీలో భారీ ఎత్తున కొలువుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టీజీఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు పచ్చజెండా ఊపింది. కార్పొరేషన్లో మొత్తం 3035 ఉద్యోగాల భర్తీకి తీపి కబురు చెప్పింది. వరుస నోటిఫికేషన్లతో నియామకాలను వేగవంతం చేసిన ప్ర భుత్వం కార్పొరేషన్లలో కీలక ఖాళీలు, ప్రతిపాదనలపై సత్వర నిర్ణయాలు తీసుకుంటోంది.

ఆర్టీసీలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదించింది. 3,035 పోస్టుల్లో 2,000 డ్రైవర్, 743 శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్), 84 డిప్యూటీ సూపరిం టెండెంట్ (ట్రాఫిక్), 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్ (సివిల్), 7 మెడికల్ ఆఫీసర్ (జనరల్), 7 మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) కొలువులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.

ఆర్టీసీలో వివిధ కేటగిరిల్లో 3,035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తంచేశారు.

Tags

Next Story