TS : గురుకుల టీజీటీ ఫలితాలు విడుదల

Telangana : తెలంగాణలోని సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల్లో 4020 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ఫిజికల్ సైన్స్, తెలుగు, ఇంగ్లీష్, బయలాజికల్ సైన్స్, జనరల్ సైన్స్ విభాగాల వారీగా జాబితాను విడుదల చేశారు. మొత్తం 9 వేల పోస్టుల్లో అత్యధికంగా టీజీటీ పోస్టులే ఉన్నాయి. టెట్ మార్కుల పరిశీలన ప్రక్రియను పూర్తిచేసి గురుకుల బోర్డు ఆదివారం ఫలితాలను విడుదల చేసింది.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను ఈరోజు నుంచి 28 వరకు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను అధికారులు శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో ప్రాథమిక జాబితాలో ఉన్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. దీనికి సంబంధిత ధ్రువప త్రాలను అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికయ్యే వారి తుది జాబితాను విడుదల చేయనున్నారు.
తుది జాబితాను ప్రకటించిజేఎల్, డీఎల్ పాటు టీజీటీ వారిని కలిపి 6 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు మార్చి 2న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలను అందించేందుకు ఏర్పాట్లను గురుకుల బోర్డు చేస్తోంది. ఇప్పటికే 1997 అభ్యర్ధులకు సీఎం చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందించిన విషయం తెలిసిందే. 9 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ ఇక దాదాపు తుది దశకు చేరినట్లే. ఇదిలా ఉంటే ధ్రువ పత్రాల పరిశీలనకు అధికారులు తగిన సమయం ఇవ్వకపోవడంపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com