NEET Exam : రేపే నీట్ పరీక్ష.. నిమిషం కూడా లేట్ వెళ్లొద్దు

వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్ యూజీ-2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహణకు అంతా సిద్ధమైంది. రేపు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.
పరీక్ష నిర్వహణకు అన్ని సన్నాహాలు పూర్తి చేసింది ఎన్టీఏ. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 23లక్షల 81వేల 833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు కాకుండా, ఈ పరీక్ష మొత్తం 13 భాషలలో పెన్,పేపర్ విధానంలో నిర్వహించబడుతుంది.
ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పరీక్ష మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అన్నారు నీట్ ఉమ్మడి వరంగల్ జిల్లా సిటీ కోఆర్డినేటర్ మంజుల దేవి. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ వెంట తీసుకురావలసి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com