NEET Re-Exam : నీట్ రీ ఎగ్జామ్... 61కి తగ్గిన టాపర్లు

నీట్ అక్రమాల వివాదం నేపథ్యంలో నిర్వహించిన రీ- ఎగ్జామ్ లో టాపర్ల జాబితా మారిపోయింది. సుప్రీం ఆదేశాలతో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు పరీక్ష రద్దుచేసిన ఎన్టీఏ మళ్లీ రీఎగ్జామ్ నిర్వహించారు. ఈ ఫలితాలను NTA సోమవారం విడుదల చేసింది. దీంతో పాటు నీట్ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులను సవరించినట్లు వెల్లడించింది.
మొత్తం 1563 మందికి రీఎగ్జామ్ నిర్వహించగా, 813 మంది మాత్రమే హాజరయ్యారు. 750 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష రాసిన 813 మందిలో ఒక్కరూ టాపర్ల జాబితాలో లేరు. పూర్తిమార్కులు సాధించిన టాపర్ల సంఖ్య 67 నుంచి 61కి తగ్గింది. గతంలో, హర్యానాలోని ఒక కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. ఇప్పుడు వాళ్లెవరూ రీ-ఎగ్జామ్ లో పూర్తి మార్కులు సాధించలేదు.
టాప్ స్కోరర్ల సంఖ్య అధికారికంగా తగ్గింది. పరీక్షఫైనల్ ఆన్సర్ కీని నీట్ అధికారిక వెబ్ సైట్ లో ప్రచురించారు. తుది ఫలితాల తర్వాత పరీక్ష రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఎన్టీఏ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com