NIKE : ఉద్యోగులకు నైక్ షాక్ .. 1600 మంది ఉద్యోగులు ఔట్!

NIKE : ఉద్యోగులకు నైక్ షాక్ .. 1600 మంది ఉద్యోగులు ఔట్!

వాషింగ్టన్ (Washington): ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల్లో లేఆఫ్స్ పర్వం కొనసాగుతున్నవేళ.. మరో దిగ్గజ సంస్థ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రముఖ స్పోర్ట్ వేర్ తయారీ సంస్థ అయిన నైక్ (NIKE).. తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్న ట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ తొలగింపులు ఉంటాయని వివరించింది. రెండు దశల్లో ఈ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. తొలి దశ ఇవాల్టి నుంచే ప్రారంభమవుతుందో ని పేర్కొంది. ఇక రెండో విడత తొలగింపులు నాలుగో త్రైమాసికం చివరి నుంచి ఉంటాయని వెల్లడించింది. వ్యయ నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నైక్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నైక్లో 83,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story