Basara IIIT Admissions : బాసర IIITలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

బాసర ట్రిపుల్ ఐటీలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిన్న నోటిఫికేషన్ రిలీజైంది. పదో తరగతిలో విద్యార్థుల జీపీఏ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. బాసర ట్రిపుల్ ఐటీలో మొత్తం 1,500 సీట్లు ఉండగా, జూన్ 1 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 3న ప్రొవిజినల్ సీట్లు కేటాయిస్తారు. జులై 8న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్లై చేసుకోవాల్సిన సైట్ ఇదే http://www.rgukt.ac.in
పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆరేళ్ల బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేస్తారు. విద్యార్ధులు ఇంటర్ సమానమైన పియూసీ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ట్రిపుల్ ఐటీలో ఏడాదికి ఫీజు రూ.37 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఫీ రీయింబర్స్‌మెంట్ అర్హత ఉన్న వారు వాటిని చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.వెయ్యి, కాషన్ డిపాజిట్ రూ.2 వేలు, ఆరోగ్య బీమా కింద రూ.700... మొత్తం రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
కాగా.. బాసర ట్రిబుల్ ఐటీలో దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020-21లో 32,000 మంది, 2021-22లో 20,178 మంది, 2022-23లో 31,432 మంది, 2023-24లో 32,635 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com