PAYTM : పేటీఎంలో ఎంప్లాయీస్‌కి పింక్ స్లిప్ లు

ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తన ఉద్యోగులకు పింక్ స్లిప్స్ పంపిణీ చేసింది. భారీగా ఉద్యోగులను సాగనంపనుంది. ఉద్యోగులను తొలగించినట్లు పేటీఎం ధృవీకరించింది.
ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇతర సంస్థల్లో ఉపాధి కల్పనకు సాయపడుతున్నట్లు పేటీఎం చెబుతున్నట్లు ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాజీనామా చేసిన ఉద్యోగులకు కొత్త ఉద్యోగాల కల్పనకు 30 సంస్థలతో కలిసి తమ హెచార్ విభాగం పని చేస్తోందని పేటీఎం వెల్లడించింది.
ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న నేపథ్యంలో ఉద్యోగులందరికీ బోనస్ కూడా ఇచ్చింది. ఉద్యోగుల తొలగింపు విషయమై తాము అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు పేటీఎం తెలిపింది. తాజా లేఆఫ్స్ తో సంస్థ సేల్స్ డివిజన్లో పని చేస్తున్నవారిలో 3500 మంది ఉద్యోగులు తగ్గారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వీసులపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం నష్టాలు పెరిగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com