POLYCET Councelling : జూన్‌ 20 నుంచి పాలీసెట్‌ కౌన్సెలింగ్‌

POLYCET Councelling : జూన్‌ 20 నుంచి పాలీసెట్‌ కౌన్సెలింగ్‌
X

జూన్‌ 20వ తేదీ నుంచి పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ఈమేరకు శుక్రవారం షెడ్యూల్‌ విడుద లైంది. జూన్‌ 20 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 22 నుంచి 25వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, జూన్‌ 22 నుంచి 27 వరకు సీట్ల కోసం ఆప్షన్ల నమోదు చేసుకోవాలి. జూన్‌ 30న సీట్లు కేటాయిస్తారు. జూన్‌ 30 నుంచి జూలై 4వరకు సీట్లు పొందిన అభ్యర్థులు ఫీజు చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. తుది దశ కౌన్సెలింగ్‌ను జూలై 7నుంచి నిర్వహిస్తారు. జూలై 13న సీట్లు కేటాయిస్తారు. జూలై 18 నుంచి తరగతులు ప్రారంభిస్తారు. జూలై 23న స్పాట్‌ అడ్మిషన్లను నిర్వహిస్తారు.

Tags

Next Story