NEET Exam Scores : నీట్ పరీక్షలో మార్కులు కలపడంపై సుప్రీంలో పిటిషన్

నీట్- 2024 వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కొంత మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. 1536 మంది విద్యార్ధులకు గ్రేస్ మార్కులు కలిపారు. నీట్ దరఖాస్తుదారు అయిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన పిటిషనర్ జరిపాటే కార్తీక్ ఈ రిటిపిటిషన్ దాఖలు చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టిక్ 32 కింద ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాదులు వై.బాలాజీ, చిరాగ్ శర్మ దీనిపై సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ఈ పిటిషన్ ను ముందుగా నమోదు చేయాలని కోరారు. గ్రేస్ మార్కులు ఇవ్వడానికి నార్మలైజేషన్ ఫార్ములాను తప్పుగా వర్తింపచేయడం చట్టవిరుద్ధమని, ఏకపక్షమని ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ఉల్లంఘన కిందకు వస్తుందని పిటిషనర్ తెలిపారు. ఈ పరీక్ష విషయ పరిజ్ఞానాన్ని నిర్ధారించడం లక్ష్యంగా నిర్వహించినందున నార్మలైజేషన్ ఫార్ములా దీనికి వర్తించదని పేర్కొన్నారు.
విద్యార్థి అన్ని ప్రశ్నలకు జవాబు ఇస్తే నార్మలైజేషన్ ఫార్ములా వర్తించదని తెలిపారు. ఒక ప్రశ్నకు తప్పుగా జవాబు ఇస్తే ఈ ఫార్ములా ఆటోమెటిక్ గా వర్తించదని, ఒక వేళ సరైన జవాబు ఇస్తే అప్పటికే దానికి మార్కులు వస్తాయని తెలిపారు. ఈ కేసులో నార్మలైజేషన్ ఫార్ములా ఏ విధంగానూ బెస్ట్ కాదని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com