NEET Petitions : నీట్ పై సుప్రీంలో అన్ని పిటిషన్లూ కలిపి ఒకేరోజు విచారిస్తాం

నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కు గురువారం నోటీసులు జారీ చేసింది. జులై 8లోగా దీనికి తగిన సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నీట్ యూజీ 2024పై వచ్చిన మిగిలిన పిటిషన్లతో కలిపి అదేరోజు విచారణ చేపడతామని పేర్కొంది.
నీట్ యూజీ 2024 మార్కుల లెక్కిం పులో ఇష్టారీతిన వ్యవహరించారంటూ పిటిషన్ ను ఓ లెర్నింగ్ యాప్ దాఖలు చేసింది. మెడికల్ పరీక్షకు హాజరైన చాలామంది ఓఎంఆర్ షీట్లను పొందలేదని పేర్కొంది. దీనిపై గురువారం జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి బెంచ్ వాదనలు విన్నది. ఓఎంఆర్ షీట్లు ఇవ్వడానికి ఏమైనా టైమ్ లను పెట్టుకుంటే తెలియజేయాలని.. దీనిపై ఎన్టీఏ స్పందించాలని పేర్కొంది.
సంబంధిత పార్టీలు ఈ అంశంపై జులై 8లోగా వివరణలు పంపాలని ఆదేశించింది కోర్టు .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com