మార్నింగ్ అసెంబ్లీకి రాలేదని 100 మంది విద్యార్థులపై వేటు

మార్నింగ్ అసెంబ్లీకి రాలేదని 100 మంది విద్యార్థులపై వేటు

ఢిల్లీలోని (Delhi) సెయింట్ స్టీఫెన్ కళాశాల (St. Stephen's College) ఉదయం అసెంబ్లీకి (Assembly) హాజరు కానందుకు సుమారు 100 మంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు ఒక ఉపాధ్యాయుడు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేయకుంటే డీబార్ చేస్తామని కాలేజీ యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది.

విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ జాన్ వర్గీస్‌కు లేఖ రాస్తూ, కళాశాల నుండి విద్యార్థులను సస్పెండ్ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పరీక్షలకు హాజరు కాకుండా వారిని డిబార్ చేస్తామనే బెదిరింపును ఉపసంహరించుకోవాలని అభ్యర్థించారు. అయినా అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేదు.

కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న 100 మందికి పైగా విద్యార్థులకు ఫిబ్రవరి 17న ఇమెయిల్ వచ్చింది. వారిని సస్పెండ్ చేసినట్టు, రెండవ సెమిస్టర్ పరీక్షను కూడా రాయనివ్వకుండా డిబార్ చేస్తారని వారికి తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story