TS 10th Supplementary Results : నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు

TS 10th Supplementary Results : నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు
X

పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరిగాయి. వీటికి దాదాపు 51, 237 మంది విద్యార్థులు హాజరయ్యారు. టెన్త్‌ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల‌ను ఈ వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లో చూసుకోవ‌చ్చని అధికారులు తెలిపారు.

వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్‌ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు పదవ తరగతి బోర్డు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించింది. తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 30న విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.టెన్త్ వార్షిక‌ ఫ‌లితాల్లో 91.31 ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. బాలిక‌లు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

Tags

Next Story