Telangana EDCET Results : ఇవాళ తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు

Telangana EDCET Results : ఇవాళ తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు

తెలంగాణ ఎడ్‌సెట్ ఫ‌లితాలను ఇవాళ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ఉన్నత విద్యా మండ‌లి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు. మే 23న జరిగిన ఈ పరీక్షకు 33,789 మంది దరఖాస్తు చేసుకోగా, 87 శాతం మంది హాజరయ్యారు. సెష‌న్‌-1లో 14,633 మంది, సెష‌న్-2లో 14,830 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఈ ఏడాది టీఎస్‌ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్ మార్చి 4వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మార్చి 6వ తేదీ నుంచి మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు.

అనంతరం రూ.250 ఆలస్య రుసుంతో మే 13వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించారు. తర్వాత.. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. మే 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఈ ఎడ్‌సెట్ 2024 పరీక్షల బాధ్యతను చేపట్టింది.

➥ ఫలితాల కోసం విద్యార్థులు మొదట ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - https://edcet.tsche.ac.in/

➥ అక్కడ హోంపేజిలో కనిపించే ఫలితాలు/ర్యాంకు కార్డుకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.

➥ ఆ తర్వాత వచ్చే పేజీలో విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'View Result/View Rank Card' బటన్ మీద క్లిక్ చేయాలి.

➥ ప్రవేశ పరీక్ష ఫలితాలు/ర్యాంకు కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

➥ విద్యార్థులు ఫలితాలు/ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసి భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

Tags

Next Story