Telangana DSC : తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. గతంలో అప్లై చేసుకున్న వారు మళ్లీ ధరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా ధరఖాస్తు చేసుకునే వాళ్లు మాత్రం రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 2024 మార్చి 04వ తేదీ నుంచి ఏప్రిల్ 02 వరకు ధరఖాస్తులు అన్ లైన్ లో స్వీకరిస్తారు. గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టులను అదనంగా పెంచి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com