Telangana TET Results : రేపు తెలంగాణ టెట్ ఫలితాలు

Telangana TET Results : రేపు తెలంగాణ టెట్ ఫలితాలు

మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాలను రేపు అధికారులు విడుదల చేయనున్నారు. పేపర్-1కి 99,958 మంది, పేపర్-2కి 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండింటికీ కలిపి 2,36,487 మంది(83 శాతం) హాజరయ్యారు. కాగా డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

ఈ సారి టెట్‌ పరీక్షలకు 2,86,381 దరఖాస్తు చేసుకోగా.. వారలో పరీక్షలకు 2,36,487 మంది హాజరయ్యారు. పేపర్‌ వారీగా చూస్తే.. పేపర్‌-1కు 99,958 మంది దరఖాస్తు చేసుకోగా 86.03 శాతం మంది హాజరయ్యారు. ఇక పేపర్‌-2కి 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 82.58 శాతం మంది హాజరయ్యారు.

టెట్‌ పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో యమ డిమాండ్‌ ఉంటుంది. డీఎస్సీ నియామకాల్లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అలాగే ప్రభుత్వ టీచర్‌ పోస్టుల నియామకాలకు నిర్వహించే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) రాసేందుకు టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించవల్సి ఉంటుంది.

Tags

Next Story