Educational Institutions : నేడు విద్యాసంస్థలు బంద్

NEETతో పాటు పలు పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజీలను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. SFI, AISF, PDSU వంటి యూనియన్లు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి బంద్ నోటీసులు కూడా ఇచ్చాయి. మరోవైపు TGలో నిరుద్యోగ సంఘాలు DSCని 45రోజులు వాయిదా, టెట్ నార్మలైజేషన్, జాబ్ క్యాలెండర్ ప్రకటన, గ్రూప్1 పోస్టుల్లో 1:100 నిష్పత్తి వంటి డిమాండ్లతో బంద్‌కు పిలుపునిచ్చాయి.
పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయిన ఎన్టీఏను రద్దు చేయాలని, పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. నీట్, నెట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. కేంద్ర పరీక్షల నిర్వహణను రాష్ర్టాలకు అప్పగించాలని కోరాయి.
కాగా, గురువారం జరిగే బంద్ కు విద్యాసంస్థలన్నీ మద్దతివ్వాలని, స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విద్యార్థి సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. కాగా..విద్యార్థి, యువజన సంఘాలు ఇచ్చిన విద్యాసంస్థల బంద్‌కు మద్దతిస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com