TS PGECET : నేడు పీజీఈసెట్ ఫలితాలు

TS PGECET : నేడు పీజీఈసెట్ ఫలితాలు
X

తెలంగాణలో నేడు పీజీఈసెట్ ( TG PGECET ) ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారు. ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 20,626 మంది హాజరయ్యారు. ఫలితాలను https://pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. . ఈ నెల 10 నుంచి 13 వరకూ ఆన్ లైన్ లో జరిగిన పరీక్షలకు మొత్తం 22,712 మందికి గానూ.. 20,626 మంది అటెండ్ అయ్యారు.

రాష్ట్రంలోని పీజీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'TS PGECET-2024' నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్ మార్చి 12న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల ద్వారా మార్చి 16 నుంచి మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇక రూ.250 ఆల‌స్య రుసుంతో మే 14 వ‌ర‌కు దరఖాస్తులు స్వీకరించారు.

అదేవిధంగా రూ. 1000 ఆలస్య రుసుముతో మే 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రూ.2,500 ఆలస్య రుసుముతో మే 21 వరకు, రూ.5,000 ఆల‌స్య రుసుంతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. మే 28న హాల్‌టికెట్లు విడుదల చేసి.. జూన్ 10 నుంచి 13 వ‌ర‌కు టీఎస్‌పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించింది.

Tags

Next Story