ఆదిపురుష్ భారతీయత లోపించిన రామాయణం

ఆదిపురుష్ భారతీయత లోపించిన రామాయణం
X
ఈ జనరేషన్ కి నచ్చాలనే ప్రయత్నం లో చేసిన పెద్ద తప్పు గా ఆదిపురుష్ గుర్తుండి పోతుంది .

భారీ అంచనాల తో రిలీజ్ అయిన ఆది పురుష్ మొదటి ఆట నుండే మిశ్రమ స్పందన తెచ్చు కుంది .

రామాయణ కావ్యం విన్నా చదివినా జన్మ తరిస్తుంది . వెండితెరపై యాక్టర్ల ను దేవుళ్ళ ని చేసిన వాల్మీకి కావ్యం దశాబ్డం తరువాత వెండి తెరపై చూసాం .

భారీ హంగులు, భారీ కాస్టింగ్ , భారీ బడ్జెట్ లు , భారీ ప్రమోషన్స్ ఆది పురుష్ పై అంచనాలను ఆకాశం లొ ఉంచాయి, కానీ ఓం రావత్ రామాయణ ఔన్నత్యం అర్ధం చేసుకోలేక పోయాడని అడుగడుగునా అనిపించింది.

భారీ తనం తో నిండిన తెరపై విజువల్స్ కళ్ళ ను దాటి గుండెల్లో కి చేరలేకపోయాయి. రాముని సుగుణాలని ప్రతిబిబించే సన్నివేశాలను కూడా చాలా పేలవం గా తెరమీదకు తెచ్చాడు. వాలి ని రాములు వారు చంపే సన్నివేశం వీడియో గేమ్ లాగ అనిపించింది. సీతాదేవి అపహరణ కూడా చాలా విమర్శలకు గురి అవుతుంది. ఒక మాయావి గా రావణాసురుడు చూపించాలనే తహ తహ తప్ప అతని గుణ గణా లని ప్రదర్శించే నేర్పు దర్శకుడి లొ కనపడ లేదు.

రాముడి లో కనిపించే ధీరత్వం ఎక్కడా పెద్దగా ఎలి వేట్ అవలేదు. రావణుడి తో పోరాటాలను ఆసక్తి గా మారచలేదు .

రామాయణం లొ మనం ఇప్పటి వరకూ చూసిన కొన్ని ఐకానిక్ సన్నివేశాలని ఎలాంటి ఎమోషన్స్ లేకుండా గ్రాఫిక్స్ గందర గోళం లొ పడవేసాడు దర్శకుడు.

రామసేతు నిర్మాణానికి చాలా ఎమోషన్స్ నీ యాడ్ చేసే అవకాశం ఉన్నా దర్శకుడు ఆ సన్నివేశానికి ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసి ఆ ఎమోషన్స్ ని నిలపలేక పోయాడు .

ఇక లంక ని తన పూర్తి ఊహ ప్రపంచం లో పడేసాడు. ఒక పురాణం చేస్తున్నాం అనే స్పృహ కూడా కనిపించలేదు . ఒక హాలీవుడ్ మూవీ ని చూస్తున్నాం అనే భ్రమ లో పడిపోయారు ప్రేక్షకులు.

భారతీయత లేని రామాయణం లా అనిపించింది.

ఈ జనరేషన్ కి నచ్చాలనే ప్రయత్నం లో చేసిన పెద్ద తప్పు గా ఆదిపురుష్ గుర్తుండి పోతుంది .

Tags

Next Story