‘ప్రాజెక్ట్ కె‘కు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ..!

‘ప్రాజెక్ట్ కె‘కు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ..!
విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ‘ప్రాజెక్ట్ కె‘లో ఉండబోతున్నాడనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా స్ప్రెడ్ అవుతోంది.

‘ఆదిపురుష్‘గా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న ప్రభాస్.. అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ క్రేజీగానే ఉంది. ఒకటి తర్వాతి ఒకటిగా భారీ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడు. వాటిలో ఎంతో ప్రత్యేకమైన ఒక సినిమా ‘ప్రాజెక్ట్ కె‘. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా నటిస్తుంది. అలాగే.. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వీరు మాత్రమే కాకుండా.. ఓ విశ్వనటుడు కూడా ‘ప్రాజెక్ట్ కె‘లో భాగస్వామ్యమవ్వబోతున్నాడట. ఇంతకీ ఎవరా స్టార్?

ప్రెజెంట్ ప్రభాస్ మోస్ట్ అవెయిటింగ్ ప్రాజెక్ట్స్ లిస్టులో ‘ప్రాజెక్ట్ కె‘ ఒకటి. ‘మహానటి‘ ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారట. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజులో ‘ప్రాజెక్ట్ కె‘ ఉండబోతుందని చిత్రబృందం పదేపదే చెబుతూ వస్తోంది. ‘ప్రాజెక్ట్ కె‘తో అస్సలు ఏమాత్రం సంబంధం లేకపోయినా.. ఈమధ్య ఈ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు హీరో రానా. ‘ప్రాజెక్ట్ కె‘ ప్రపంచవ్యాప్తంగా ఓ చరిత్ర సృష్టించబోతుందంటూ జోష్యం చెప్పాడు.

‘ప్రాజెక్ట్ కె‘ కాస్టింగ్ విషయానికొస్తే ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె నటిస్తుంది. మరో ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నాడు. అయితే.. ‘ప్రాజెక్ట్ కె‘ మొదలైనప్పడు చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన పేర్లు ఇవి. కానీ.. ఈమధ్య మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని కూడా ‘ప్రాజెక్ట్ కె‘లో ఉందని అనౌన్స్ చేసింది టీమ్. ఇంతటితో ఈ కాస్టింగ్ ఆగిపోలేదు. లేటెస్ట్ గా విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ‘ప్రాజెక్ట్ కె‘లో ఉండబోతున్నాడనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా స్ప్రెడ్ అవుతోంది.

‘ప్రాజెక్ట్ కె‘లో నటించడానికి కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ తో ఉండే ఓ కీలక పాత్రలో కమల్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం 30 రోజుల కాల్షీట్స్ ను కూడా కేటాయించాడట. దానికి చిత్రబృందం కూడా భారీ స్థాయిలోనే పారితోషికాన్ని ఇవ్వబోతున్నట్టు కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇక.. ‘విక్రమ్‘ మూవీ సెన్సేషనల్ హిట్ తో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చిన కమల్.. ప్రస్తుతం ‘ఇండియన్2‘తో బిజీగా ఉన్నాడు. మొత్తంమీద.. ‘ప్రాజెక్ట్ కె‘లో కమల్ ఎంట్రీపై ఏదైనా అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story