Tillu Square : కలెక్షన్లలో దూసుకుపోతున్న టిల్లు స్క్వేర్

సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ (Tillu Square Movie) కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఈ సినిమా రెండో రోజు బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టింది. ఓవరాల్‌గా తొలి రెండు రోజుల్లో రూ.45.3 కోట్లు కొల్లగొట్టింది. వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందించారు.
ఈ సినిమా నిర్మాత నాగవంశీ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ఫస్ట్ డే 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావచొచ్చని అన్నారు. అలాగే లాంగ్ రన్‌లో 100 కోట్లు కొల్లగొడుతుందని చెప్పాడు. దీంతో.. టిల్లు ఎంత రాబడుతుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న మార్చి 29న రిలీజై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉండటంతో థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయి. ఏకంగా 27 కోట్లకు టిల్లు స్క్వేర్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com