Rajya Sabha : 12 మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా సహా మొత్తం 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎల్. మురుగన్, ధర్మశీల గుప్తా, మనోజ్ కుమార్ ఝా, సంజయ్ యాదవ్, గోవిందా భాయ్ లాల్జీభాయ్ ధోలాకియా, సుభాష్ చందర్, హ ర్ష్ మహాజన్, జీసీ చంద్రశేఖర్, అశోక్ సింగ్ చంద్రకాంత్, హండోరే మేధా, విశ్రమ్ కులకర్ణి, సాధన సింగ్ ఉన్నారు.
కాగా, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సహా 54 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. వీరిలో 9 మంది కేంద్రమంత్రులు కూడా ఉన్నారు. మంగళవారం ఒక్క రోజే 49 మంది. రాజ్యసభ ఎంపీలు పదవీ విరమణ చేయగా, ఐదుగురు ఎంపీలు బుధవారం పదవీ విరమణ చేశారు. వీరిలో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, మన్సుభ మాండవీమ, పురుషోత్తం రూపాలా, రాజీవ్ చంద్రశేఖర్, మురళీధరన్, నారాయణ్ రాణే ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com