Maruti Suzuki : 16వేల మారుతీ సుజుకీ కార్లు రీకాల్

మారుతీ సుజుకీ 16వేల కార్లను రీకాల్ చేసింది. ‘2019లో JUN 30 నుంచి NOV 1 మధ్య సేల్ అయిన 11,851 బాలెనో.. 4,190 వాగన్-ఆర్ కార్లలో ఫ్యూయెల్ పంప్ మోటార్‌లో లోపం ఉన్నట్లు గుర్తించాం. దీంతో ఇంజిన్ స్టార్ట్ కాకపోవడం లేదా ఆగిపోవడం వంటి సమస్యలు రావొచ్చు. సంబంధిత కస్టమర్లను సంప్రదించి ఉచితంగా రిపేర్ చేస్తాం’ అని తెలిపింది. కాగా 2023లో స్టీరింగ్ రాడ్ లోపం కారణంగా 87,599 ఎస్-ప్రెసో, ఎకో కార్లను రీకాల్ చేసింది.
మరోవైపు, మారుతీ సుజుకీ కంపెనీ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్లను పరిచయం చేస్తుంటుంది. అలాగే తమ కార్లను వీలైనంత త్వరగా కస్టమర్లకు డెలివరీ చేస్తుంటుంది. అయితే సాధారణంగా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కార్లను రూపొందించి, వాటిని డెలివరీ చేయడానికి కాస్త సమయం పడుతుంది.
మారుతీ సుజుకీ కంపెనీ ఇటీవల ఇన్విక్టో, జిమ్నీ, ప్రాంన్‌క్స్ మోడళ్లను లాంచ్ చేసింది. ఈ కంపెనీ తయారుచేసిన అరెనా, నెక్సా, ట్రూవాల్యూ మోడళ్లకు వినియోగదారుల నుంచి ఆదరణ ఉన్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. 2024 మార్చి మొదటివారం వరకు కంపెనీ 43.82 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉంది. 2020లో అది 31.59 బిలియన్ డాలర్లుగా ఉండేది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com