COVID 19 : 2020 మార్చి 22న పిన్ డ్రాప్ సైలెన్స్

ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కొవిడ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. అయితే, కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం 2020 మార్చి 22న మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Modi) ‘జనతా కర్ఫ్యూ’ విధించారు. నేటికి సరిగ్గా జనతా కర్ఫ్యూకు నాలుగేళ్లు పూర్తవుతోంది.
భారత దేశ జనాలకు ఈ పదమే కొత్త. ప్రపంచ దేశాల్లో ఉన్న పరిస్థితులు, ఆరోగ్య శాఖ నిపుణుల సూచనతో మెల్లమెల్లగా లాక్ డౌన్ ను జనానికి అలవాటు చేయడంలో కేంద్రం సక్సెస్ అయ్యింది. కరోనా వేవ్స్.. దశలవారీగా లాక్ డౌన్ తో ఇండియాలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమైంది. మార్చి 22తో మొదలైన లాక్ డౌన్.. క్రమంగా దాదాపు 2 నెలల పాటు కొనసాగింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నా.. ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
2020 సంవత్సరం ప్రారంభంలో దేశం, ప్రపంచం కరోనా కాలంతో పోరాడటానికి సిద్ధమవుతున్నప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2020వ సంవత్సరం మార్చి 19న రాత్రి 8 గంటలకు 135 కోట్ల మంది దేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ చేసిన ఈ విజ్ఞప్తి ప్రభావం వల్ల దేశం మొత్తం 24 గంటల పాటు నిశ్శబ్దమైంది. అదే జనతా కర్ఫ్యూ. 2020వ సంవత్సరం జనవరి 30న భారతదేశంలో మొదటి కరోనా వైరస్ కేసు నమోదైంది. వ్యాధి తీవ్రతను అంచనా వేయలేం.. ఎదుర్కోగలం మాత్రమే అన్న అంచనాతో.. 2020 మార్చి 22న ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా పబ్లిక్ కర్ఫ్యూ విధించారు. జనతా కర్ఫ్యూ కింద ప్రతి ఒక్కరూ ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల వరకు తమ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ముఖ్యమైన రంగాలకు సంబంధించిన వ్యక్తులు పని చేయడానికి అనుమతి ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com