Delhi Women's Commission : ఢిల్లీ మహిళా కమిషన్లో 223 మందికి ఊస్టింగ్
ఢిల్లీ మహిళా కమిషన్(డీడబ్ల్యూసీ)లోని 223 మంది ఉద్యోగులను లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా తొలగించారు. స్వాతి మలివాల్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నియమించారని ఆరోపిస్తూ తొలగించినట్లు గురువారం ప్రకటించారు. దీనిపై ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పు చేస్తే తనను జైల్లో పెట్టాలని.. అంతే తప్ప మహిళా కమిషన్ మూసేయాలనే ప్రయత్నం చేయొద్దని అన్నారు. ఇంతమంది సిబ్బందిని తొలగించడం ఢిల్లీలో మహిళలకు అన్యాయం చేయడమేనని ఆరోపించారు.
విమర్శల నేపథ్యంలో 52 మందిని మాత్రమే అక్రమంగా అపాయింట్ చేసుకున్నారంటూ డీడబ్ల్యూసీ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కమిషన్ చైర్పర్సన్ పోస్టు ఖాళీగా ఉంది. అయితే, ప్యానెల్ 40 పోస్టులనే మంజూరు చేయగా.. 223 మందిని నియమించారని ఎల్జీ ఆఫీసు ఆరోపించింది. ఇలా నియామకాలు చేపట్టే అధికారం కమిషన్‌కు లేదని గుర్తుచేస్తూ ఆ పోస్టులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
దీనిపై స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని ప్రతి మహిళకు అండగా నిలిచేలా కమిషన్ను తమ రక్తం, చెమటతో డెవలప్ చేశామన్నారు. ఎల్జీ ధైర్యం తెచ్చుకొని తనను జైల్లో పెట్టాలని అన్నారు. ఢిల్లీ మహిళలకు అన్యాయం జరగనివ్వబోనని చెప్పారు. కమిషన్ను మూసివేయాలనే ప్రయత్నాన్ని అడ్డుకుని తీరతామని ఎంపీ స్వాతి మలివాల్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com