Criminal Cases : 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు

Criminal Cases : 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు

కొత్తగా ఎన్నికైన 543 మంది లోక్సభ సభ్యులలో 280 మంది మొదటిసారి లోకసభలో అడుగు పెట్టబోతున్నారు. 543 మందిలో ఏకంగా 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 27 మంది దోషులుగా నిర్ధారించబడ్డారని సమాచారం.

ఈ ఏడాది గెలిచిన 251 మంది అభ్యర్థుల్లో 170 మంది 31% అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలతో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఓసారి గతంలో ఎలా ఉండేదో చూద్దాం. 2019లో 159 (29%) ఎంపీలు, 2014లో 112 (21%) ఎంపీలు, 2009లో 76 (14%) ఎంపీల కంటే ఎక్కువ అని విశ్లేషణలో తేలింది. 2009 నుంచి ఇప్పటికి తీవ్రమైన క్రిమినల్ కేసులున్న ఎంపీల సంఖ్య 124% పెరిగింది.

కాంగ్రెస్ గెలిచిన 99 మంది అభ్యర్థుల్లో 49 మంది (49 %) క్రిమినల్ కేసులను ప్రకటించగా, సమాజ్ వాదీ పార్టీకి చెందిన 37 మంది అభ్యర్థుల్లో 21 మంది (45%) క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీఎంసీకి చెందిన 29 మందిలో 13 మంది (45%), డీఎంకేకు చెందిన 22 మందిలో 13 మంది (59%), టీడీపీకి చెందిన 16 మందిలో ఎనిమిది మంది (50%), శివసేన

ఏడుగురు గెలిచిన ఐదుగురు (71%) ఎంపీలపై కేసులు ఉన్నాయి.

Tags

Next Story