40మంది ట్రాఫిక్ పోలీసులు, సీనియర్ అధికారులు ట్రాన్స్ఫర్.. ఎందుకంటే..

40మంది ట్రాఫిక్ పోలీసులు, సీనియర్ అధికారులు ట్రాన్స్ఫర్.. ఎందుకంటే..
X

ముంబ్రా ప్రాంతంలో వాహనదారుల నుంచి కొందరు సిబ్బంది లంచం తీసుకుంటున్నట్లు వైరల్‌గా మారిన వీడియోతో థానేలో 40 మంది ట్రాఫిక్ పోలీసులను బదిలీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. అయితే బదిలీ అయిన సిబ్బంది అందరూ ముంబ్రా ట్రాఫిక్ పోలీసు విభాగానికి చెందిన వారని చెప్పారు. వీరిలో ముంబ్రా ట్రాఫిక్ డివిజన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సురేష్ ఖేడేకర్, కానిస్టేబుళ్లు కాకుండా ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారని కూడా తెలిపారు.

ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) విజయ్‌కుమార్ రాథోడ్ ఫిబ్రవరి 17న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సిబ్బందిని కంట్రోల్ రూమ్‌కు తరలించాం’’ అని తెలిపారు. అంతకుముందు ఓ వీడియో రద్దీగా ఉండే ముంబ్రా స్ట్రెచ్ గుండా వెళుతున్న భారీ వాహనాల డ్రైవర్ల నుండి ట్రాఫిక్ పోలీసు సిబ్బంది డబ్బు తీసుకుంటున్నట్లు చూపించింది.

Tags

Next Story