Priyanka Gandhi : ఐదేళ్లలో 43 పేపర్లు లీక్: ప్రియాంకా గాంధీ

బీజేపీ పాలనలో పరీక్షల పేపర్ లీకేజీలు ( Paper Leaks ) జాతీయ సమస్యగా మారాయని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ( Priyanka Gandhi ) మండిపడ్డారు. ఐదేళ్లలో ఏకంగా 43 పేర్లు లీకయ్యాయని ఆరోపించారు. కోట్లాది మంది యువత భవిష్యత్తును కమలం పార్టీ నాశనం చేసిందని విమర్శించారు. ‘వివిధ రకాల పరీక్షల కోసం రేయింబవళ్లు యువత కష్టపడుతోంది. తల్లిదండ్రులు అన్నీ త్యాగం చేసి వారి కోసమే బతుకుతున్నారు.
పరీక్షల్లో అవకతవకలతో విద్యార్థుల శ్రమ వృథా అవుతోంది’ అని ఫైరయ్యారు. బీజేపీ పాలనలో లక్షలాది మంది యువత భవిష్యత్త్ నాశనం అయిందని ఆరోపించింది. ఈ లీకేజీ కుంభకోణంలో 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష స్కామ్ కి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన తెలియజేస్తుందని ప్రియాంక గాంధీ అన్నారు.
మరోవైపు వయనాడ్‌లో జరగనున్న ఉప ఎన్నికలో ఏఐసీసీ అగ్ర నేత ప్రియాంకా గాంధీ తరఫున పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా కూటమి తరఫున ఆమె ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్‌కు ఉపఎన్నిక అనివార్యమైంది. ఖాళీ అయిన స్థానానికి 6 నెలల్లో ఎన్నిక జరపాలనే నిబంధన ఉంది. దీంతో త్వరలోనే ఈసీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com