5G Users : వచ్చే మూడేళ్లలో 77 కోట్లకు 5జీ యూజర్లు

5G Users : వచ్చే మూడేళ్లలో 77 కోట్లకు 5జీ యూజర్లు
X

దేశంలో వచ్చే మూడేళ్లలో 5జీ యూజర్ల సంఖ్య 77 కోట్లకు చేరుతుందని ఒక నివేదిక తెలిపింది. ప్రతి నెలకు ఒక్కో యూజర్ 40 జీబీ డేటా వినియోగిస్తారని నోకియా సంస్థ నివేదికలో పేర్కొంది. డేటా తన వినియోగంలో 4జీ, 5జీ మిళితంగా ఉంటుందని తెలిపింది. 2024లో 27.5 జీబీగా ఉన్న డేటా వినియోగం ఏటా 19.5 శాతం చొప ఎ వచ్చే ఐదు సంవత్సరాలు వృద్ధి చెందుతుందని తెలిపింది. దేశంలో 5జీ యూజర్ల సంఖ్య శరవేగంగా పెరుగుతుందని పేర్కొంది. వీరి సంఖ్య 2024లో 29 కోట్లుగా ఉందని, ఇది 2028 నాటికి 77 కోట్లకు చేరుతుందని తెలిపింది. 5జీ డేటా వినియోగం ప్రధానంగా ఫిక్స్‌డ్ వైర్ లెస్ యాక్సెస్ విధానంలో పెరుగుతుందని తెలిపింది. నివాస గృహలు, ఆఫీస్ ల్లో 5జీ డేటా వినియోగం, మొబైల్ డేటా కంటే అధికంగా వినియోగం అవుతుందని తెలిపింది. 2025 చివరి నాటికి 90 శాతం మొబైల్ ఫోన్లు లీజీ వినియోగానికి అనువైనవి ఉంటాయని పేర్కొంది.

Tags

Next Story